Revanth Reddy: విధులకు రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డుమ్మా?

Revanth Reddy security personals absent from duties

  • ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది గైర్హాజరు
  • రెండు రోజులుగా విధులకు సెక్యూరిటీ గైర్హాజరు
  • రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న కాంగ్రెస్ వర్గాలు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టారు. ఇటీవల పోలీసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిన్నటి నుండి సెక్యూరిటీ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. దీంతో సెక్యూరిటీ లేకుండానే రెండు రోజులుగా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై నాగర్ కర్నూలులో కేసు నమోదయింది.

రేవంత్ రెడ్డి రెండు నెలల క్రితమే తనకు సెక్యూరిటీ కావాలని కోర్టును ఆశ్రయించారు. తొలుత 4 ప్లస్ 4 గన్ మెన్ ఉండగా, ఇటీవల ప్రభుత్వం దానిని 2 ప్లస్ 2కు కుదించింది. తాజాగా, నిన్నటి నుండి మిగిలిన సెక్యూరిటీ సిబ్బంది కూడా గైర్హాజరైంది.

Revanth Reddy
Congress
Police
  • Loading...

More Telugu News