Governor: టీఎస్ఆర్టీసీ బిల్లును న్యాయసలహా కోసం పంపించిన గవర్నర్ తమిళిసై

  • టీఎస్ఆర్టీసీ బిల్లుకు వారం రోజులు దాటినా ఆమోదం తెలపని గవర్నర్  
  • ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లుల్నీ న్యాయసలహా కోసం పంపిన గవర్నర్
  • న్యాయశాఖ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్న రాజ్ భవన్
Governor Tamilisai sent TSRTC bill to nyaya salaha

టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ బిల్లును న్యాయ శాఖకు పంపించారు. దీంతో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయసలహా కోసం పంపించారు. టీఎస్ఆర్టీసీ బిల్లుపై దురుద్దేశంతో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. బిల్లును న్యాయసలహా కోసం పంపించామని, న్యాయశాఖ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని రాజ్ భవన్ తెలిపింది.

టీఎస్ఆర్టీసీ బిల్లుకు వారం రోజులు దాటినా గవర్నర్ తమిళిసై ఆమోదం లభించలేదు. ఈ బిల్లు ద్వారా కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ ఇదివరకే చెప్పారు. అయితే వారం గడిచినా గవర్నర్ ఆమోదించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ రోజు అల్టిమేటం జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ నుండి స్పష్టత వచ్చింది.

More Telugu News