Group-1: ఏపీలో గ్రూప్-1 నియామకాల తుది ఫలితాల విడుదల

Group 1 recruitment final results released by APPSC

  • ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల చేసిన ఏపీపీఎస్సీ చైర్మన్ సవాంగ్
  • 11 కేటగిరీల్లో 110 పోస్టులకు ఎంపికలు
  • స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టుపై తర్వాత ప్రకటిస్తామన్న సవాంగ్
  • రికార్డు స్థాయిలో తక్కువ వ్యవధిలో ఫలితాలు విడుదల చేశామని వెల్లడి

ఏపీలో గ్రూప్-1 నియామక పరీక్షల తుది ఫలితాలను ఏపీపీఎస్సీ నేడు ప్రకటించింది. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ నేడు విడుదల చేశారు. 

16 కేటగిరీల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు సవాంగ్ వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో ఒక పోస్టు నియామకంపై తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. అతి తక్కువ వ్యవధిలో ఫలితాలు ప్రకటించామని చెప్పారు. ఏపీపీఎస్సీ ఫలితాల పరంగా ఇదొక రికార్డు అని తెలిపారు. 

2022 సెప్టెంబరులో మొత్తం 111 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2023 జనవరి 8న ప్రిలిమ్స్ నిర్వహించి జనవరి 27న ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేసినట్టు సవాంగ్ వెల్లడించారు. ఇక, జూన్ 3 నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్ నిర్వహించి... మెయిన్స్ లో అర్హత పొందినవారికి ఆగస్టు 2 నుంచి 11 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్టు వివరించారు. 

కాగా, ఏపీపీఎస్సీ ఫలితాల్లో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష మొదటి ర్యాంకు సాధించగా... భూమిరెడ్డి భవాని, కంబాలకుంట లక్ష్మీప్రసన్న, కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, భానుప్రకాశ్ రెడ్డి టాప్-5లో నిలిచారు.

Group-1
APPSC
Gautam Sawang
Andhra Pradesh
  • Loading...

More Telugu News