TDP: తిరుమల నడకదారిలో భక్తులకు చేతి కర్రలు... సెటైర్ విసిరిన టీడీపీ

  • అలిపిరి నడకమార్గంలో చిరుత దాడిలో లక్షిత అనే బాలిక మృతి
  • భక్తులకు రక్షణ కోసం చేతి కర్రలు అందించాలని టీటీడీ నిర్ణయం
  • టీటీడీ నిర్ణయంపై భారీ ట్రోలింగ్
  • కర్రకు ఒరిజినల్ పులి ఎలా భయపడుతుందన్న టీడీపీ
  • అక్కడుంది పరదాల మధ్య తిరిగే 'పులకేసి' కాదంటూ వ్యంగ్యం
Telugudesam Party reacts on TTD decision of hand sticks to pilgrims

తిరుమల అలిపిరి నడకమార్గంలో ఇటీవల లక్షిత అనే చిన్నారిని చిరుతపులి బలిగొన్న నేపథ్యంలో, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు రక్షణ కోసం చేతి కర్రలు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం నేపథ్యంలో, టీటీడీపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. 

టీటీడీ నిర్ణయంపై తెలుగుదేశం పార్టీ కూడా వ్యంగ్యంగా స్పందించింది. కర్రలు రెడీ... ఇక పులి రావడమే తరువాయి అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేసింది. 

"పరదాల మధ్యే ఉండే 'పులకేసి' అయితే కర్రకు భయపడతాడు. కానీ అక్కడ ఉండేది మనుషులను తినేస్తున్న ఒరిజినల్ 'పులి'. వీళ్లని నమ్మడం కంటే గోవింద నామస్మరణ చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించింది.

More Telugu News