basil seeds: సబ్జా.. రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు!

  • వీటిల్లో విలువైన యాంటీ ఆక్సిడెంట్లు 
  • క్యాల్షియం, మెగ్నీషియం కూడా
  • రోజువారీ తీసుకోవడం వల్ల కేన్సర్ నుంచి రక్షణ
health benefits of basil seeds

సబ్జా గింజలను బేసిల్ సీడ్స్ అని అంటారు. ఆయుర్వేదంలో దీని గురించి ప్రస్తావించినట్టు నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు, చైనీస్ సహజసిద్ధ ఔషధాల్లోనూ దీన్ని వినియోగిస్తుంటారు. ఎందుకంటే ఈ బేసిల్ సీడ్స్ లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.

  • క్యాల్షియం, మెగ్నీషియం అనేవి ఎముకల ఆరోగ్యానికి తప్పకుండా కావాలి. రోజువారీ ఆహారం నుంచి ఇవి తగినంత అందవు. అందుకని సబ్జా గింజలను రోజువారీగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన క్యాల్షియం, మెగ్నీషియం లోపం లేకుండా చూసుకోవచ్చు.
  • బేసిల్ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా సాల్యుబుల్ (కరిగిపోయే) ఫైబర్, పెక్టిన్ ఉంటాయి. ఈ పెక్టిన్ అనేది పొట్ట వెంటనే ఖాళీ అవ్వకుండా చూస్తుంది. అంతేకాదు ఇది విడుదల చేసే హార్మోన్ల వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది.
  • టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు రోజువారీ సబ్జా గింజలను తినడం వల్ల భోజనం అనంతరం షుగర్ స్థాయులు 17 శాతం తగ్గుతున్నట్టు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.
  • పాలీఫెనాల్స్, ఫ్లావనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా తగినంత సబ్జా గింజల్లో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. కేన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ ప్రాపర్టీలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
  • పేగుల ఆరోగ్యానికి సబ్జా గింజలు ఎంతో మంచివి. పెక్టిన్ కు ప్రో బయాటిక్ గుణాలు ఉన్నాయి. కనుక పేగుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
  • శరీరంలో వేడిని, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు బరువు కూడా తగ్గుతారు.  

More Telugu News