Telangana: ఆర్టీసీ బిల్లుపై డెడ్‌లైన్: గవర్నర్ తమిళిసైకి ఆర్టీసీ కార్మిక సంస్థ అల్టిమేటం

  • సాయంత్రంలోగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని టీఎంయూ డిమాండ్
  • ఈ రోజు ఆమోదించకుంటే రేపట్నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిక
  • కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాయన్న థామస్ రెడ్డి
RTC workers union ultimatum to Telangana Governor

ఆర్టీసీ బిల్లు ఆమోదంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కార్మిక సంస్థ టీఎంయూ డెడ్‌లైన్ విధించింది. ఈ రోజు (గురువారం) సాయంత్రం లోగా ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని లేదంటే రేపటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది.

ఈ మేరకు టీఎంయూ నాయకుడు థామస్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం తాను అన్ని అంశాలను పరిశీలించి బిల్లును ఆమోదిస్తానని కార్మికులకు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు బిల్లును ఆమోదించలేదన్నారు. ఈ రోజు బిల్లుకు ఆమోదం తెలపకుంటే సాయంత్రం కార్మిక సంఘాలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తుందన్నారు.

More Telugu News