Vishwak Sen: విజయ్, సమంత మాదిరిగా స్టేజ్‌పై రొమాంటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్న విష్వక్సేన్‌, నేహా శెట్టి

  • ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో జంటగా నటిస్తున్న 
    విష్వక్సేన్, నేహా
  • తొలి పాటను విడుదల చేసిన చిత్ర బృందం
  • డిసెంబర్ 8న విడుదల కానున్న చిత్రం
Vishwak Sen and Neha Shetty perform a live dance to the beats of Suttamla Soosi

యువ హీరో విష్వక్సేన్, నేహా శెట్టి జంటగా వస్తున్న చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అంజలి కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి డెల్టా నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా నుంచి నిన్న తొలిపాటను  విడుదల చేశారు. ‘సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే సీరలా.. ‘అద్దాల ఓణీలా, ఆకాశవాణిలా.. గోదారి గట్టుపై మెరిశావు మణిలా..’ అంటూ సాగే రొమాంటిక్ పాటలో విష్వక్, నేహా శెట్టి కెమిస్ట్రీ ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. 

ఈ పాటను విడుదల చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రమోషన ల్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో హీరోయిన్ ఈ పాటకు స్టేజ్‌ పైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. అచ్చం సినిమాలో మాదిరిగా స్టేజ్‌ పైనా ఇద్దరూ రొమాంటిక్ స్టెప్పులు వేశారు. రెండు రోజుల కిందట ఖుషి సినిమా ఫంక్షన్ లో విజయ్‌ దేవరకొండ, సమంతా కూడా ఓ పాటకు డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు విష్వక్సేన్, నేహా శెట్టి కూడా వాళ్ల మాదిరిగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా,సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 8న విడుదల కానుంది.

More Telugu News