Nandigama: నందిగామలో దారుణం.. టాయిలెట్ల పక్కన మహనీయుల విగ్రహాలు!

  • ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాల తొలగింపు
  • మున్సిపల్ కార్యాలయంలో మరుగుదొడ్ల పక్కన పెట్టిన వైనం
  • మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రజల ఆగ్రహం
idols of leaders next to toilets in Nandigama

ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, గుర్రం జాషువా, దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు తదితర నేతల విగ్రహాలు ఉండగా.. ట్రాఫిక్ సమస్య ఎదురవుతోందంటూ వాటన్నింటినీ తొలగించారు. 

అలా తొలగించిన విగ్రహాలను జాగ్రత్తగా ఉంచాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్ల పక్కన పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ మండిపడుతున్నారు. కనీసం గౌరవం లేకుండా ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News