Ravie Dubey: జియో సినిమా ట్రాక్ పైకి 'లఖన్ లీలా భార్గవ' సిరీస్

Lakhan Leela Bhargava Web Series Streaming date confirmed

  • జియో వెబ్ సిరీస్ గా  'లఖన్ లీలా భార్గవ 
  • కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన పాత్రను పోషించిన రవి దూబే 
  • ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్  

కొంతకాలం క్రితం వరకూ కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో నడిచే సినిమాలను .. సీరియల్స్ ను చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఆసక్తిని చూపలేదు. అందుకు కారణం వాదనలే ప్రధానంగా అవి నడిచేవి. అయితే ఇప్పుడు మాత్రం వాదనల సమయాన్ని చాలావరకూ తగ్గించి, ఆ కేసు చుట్టూ అల్లుకున్న మిగతా అంశాలు .. వాటిని ఛేదించే తీరును ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ వెళుతున్నారు. 

అలాంటి ఒక కంటెంట్ తోనే 'జియో సినిమా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి ఇప్పుడు మరో వెబ్ సిరీస్ రావడానికి రెడీ అవుతోంది. ఆ వెబ్ సిరీస్ పేరే 'లఖన్ లీలా భార్గవ'.  రవి దూబే ప్రధానమైన పాత్రను పోషించిన ఈ వెబ్ సిరీస్ ను, సుమీత్ చౌదరి - కేవల్ సేథీ నిర్మించారు. భారీ బడ్జెట్ తో 'లక్నో' నేపథ్యంలో నడిచే ఈ వెబ్ సిరీస్, ఈ నెల 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఇందులో క్రిమినల్ లాయర్ పాత్రలో హీరో కనిపిస్తాడు. అతని దగ్గరికి వచ్చే క్రిమినల్ కేసులు .. ఆ కేసుల విషయంలో ఆయనకి ఎదురయ్యే అనుభవాలు ఉత్కంఠను రేకెత్తించనున్నాయి. వృత్తి పరంగా ఆయనకి ఎదురయ్యే సవాళ్లు .. అతను వాటిని ఎలా ఎదుర్కున్నాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది. శాన్విక .. సోనాలి సచ్ దేవా .. మోహిత్ చౌహాన్ ... భువనేశ్ .. అక్షయ్ జోషి .. అరియా అగర్వాల్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Ravie Dubey
Shanvika
Sonali Sach Deva
Lakhan Leela Bhargava
  • Loading...

More Telugu News