sports: ఈ నెల 30 నుంచి ఆసియా కప్ టోర్నీ.. ఓటములలో పాకిస్థాన్ దే రికార్డు

From Bangladesh to Sri Lanka these teams most defeats in Asia cup tournament history check
  • తొలిసారిగా బరిలోకి దిగనున్న నేపాల్ జట్టు
  • 2018 తర్వాత మళ్లీ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్ లో మ్యాచ్ లు
  • ఆరుసార్లు టైటిల్ దక్కించుకున్న భారత జట్టు
ఆసియా కప్ టోర్నీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో నేపాల్ జట్టు తొలిసారి ఆడబోతోంది. అదేవిధంగా.. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీకి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ఆసియా కప్ టోర్నీ(50 ఓవర్ల ఫార్మాట్) లో అత్యధిక మ్యాచ్ లు ఓడిన జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 45 మ్యాచ్ లు ఆడిన పాకిస్థాన్.. అందులో 26 మ్యాచ్ లు గెలిచి, 18 మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ను డ్రాగా ముగించింది. ఈ 45 మ్యాచ్ లలో 13 భారత్ తో ఆడినవే కాగా అందులో 8 మ్యాచ్ లలో పాక్ ఓటమి చవిచూసింది.

ఆసియా కప్ టోర్నీలో శ్రీలంక టీమ్ మెరుగైన ప్రదర్శన చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు ఈ జట్టు ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకు 50 మ్యాచ్ లు ఆడిన శ్రీలంక జట్టు.. ఇందులో 34 మ్యాచ్ లు గెలుపొంది, 16 మ్యాచ్ లలో ఓడిపోయింది.

ఈ మెగా టోర్నీలో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. 50 ఓవర్ల ఫార్మాట్ లో 49 మ్యాచ్ లు ఆడగా.. అందులో 31 మ్యాచ్ లు గెలిచి, 16 మ్యాచ్ లలో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్ లు టై గా ముగించింది. ఇప్పటి వరకు ఆరుసార్లు టైటిల్ గెలుచుకుంది. 

2014 నుంచి ఆసియా కప్ టోర్నీ లో పాల్గొంటున్న అఫ్ఘనిస్థాన్ జట్టు 50 ఓవర్ల ఫార్మాట్ లో మొత్తం 9 మ్యాచ్ లు ఆడింది. అందులో కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచ్ లలో ఓడిపోగా ఒక మ్యాచ్ ను టై గా ముగించింది. 1986లో తొలిసారిగా ఆసియా కప్ టోర్నీలో భాగమైన బంగ్లాదేశ్ జట్టు.. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటి వరకు మొత్తం 43 మ్యాచ్‌లు ఆడింది. అందులో 7 మ్యాచ్ లు గెలిచి, 36 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. అయితే, 2018 ఆసియా కప్‌లో ఆ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

sports
Cricket
asia cup
Sri Lanka
india at asia cup

More Telugu News