KCR: వరుసగా మూడోసారి గవర్నర్ తేనీటి విందుకు కేసీఆర్ దూరం.. కానరాని కాంగ్రెస్, బీజేపీ కీలక నేతలు

  • విందుకు హాజరుకాని బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • విందులో కనిపించని రాజకీయ నేతల హడావుడి
  • హాజరైన హైకోర్టు సీజే, పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు
CM KCR away from Gov Tamilisai At Home event

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టారు. గవర్నర్ ఏర్పాటు చేసిన 'రాజ్ భవన్ ఎట్ హోమ్' కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం వరుసగా ఇది మూడోసారి. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హాజరుకాలేదు.

అలాగే, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కీలక నేతలు కూడా రాలేదు. దీంతో, తేనీటి విందు కార్యక్రమంలో రాజకీయ నాయకుల హడావుడి కనిపించలేదు. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్ జస్టిస్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.

మరోవైపు అంతకు ముందే గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తేనీటి విందుకు కేసీఆర్ కు ఆహ్వానం పంపామని... ఆయన రావడం, రాకపోవడం రాజ్ భవన్ పరిధిలో లేదని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ వైఖరి తనను ఎంతో బాధించిందని అన్నారు. గవర్నర్ల పట్ల సీఎంల వైఖరి ఇలా ఉండటం మంచిది కాదని చెప్పారు. 

More Telugu News