JC Prabhakar Reddy: గోరంట్ల మాధవ్ కు జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి కారణం ఇదే: జేసీ ప్రభాకర్ రెడ్డి

This is why Jagan given MP ticket to Gorantla Madhav says JC Prabhakar Reddy
  • తన అన్న దివాకర్ ను తిట్టినందుకే మాధవ్ కు ఎంపీ టికెట్ ఇచ్చారన్న జేసీ
  • ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమ ఇసుక దందా చేస్తున్నారని మండిపాటు
  • టీడీపీకి నేతలు లేరు.. కార్యకర్తలు ఉన్నారని వ్యాఖ్య
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన అన్న జేసీ దివాకర్ రెడ్డిని తిట్టినందుకే గోరంట్ల మాధవ్ కు జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమ ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, లేకపోతే ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే తామే ఇసుకను తోలుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు లేరని... కానీ కార్యకర్తలు మాత్రం ఉన్నారని చెప్పారు.
JC Prabhakar Reddy
JC Diwakar Reddy
Telugudesam
Gorantla Madhav
Jagan
YSRCP

More Telugu News