Balakrishna: డ్రగ్స్, అవినీతిపై పోరాడుదాం: బాలకృష్ణ

  • డ్రగ్స్ , అవినీతి, అలసత్వం యువతను పీడిస్తున్నాయన్న బాలకృష్ణ
  • తిండి గింజలు లేని స్థితి నుంచి చంద్రుడిపై స్వయంగా కాలుమోపే స్థాయికి ఎదిగామని వ్యాఖ్య
  • బసవతారకం ఆసుపత్రిలో జెండా ఎగురవేసిన బాలయ్య
We have to fight against drugs says Balakrishna

మన దేశంలో డ్రగ్స్, అలసత్వం, అవినీతి వంటి జాడ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయని... వీటిపై పోరాడాలని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎందరో మహానుభావులు చేసిన త్యాగాల ఫలితంగానే మన దేశానికి స్వేచ్ఛావాయువులు వచ్చాయని వచ్చాయని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో మన దేశంలో ఎంతో మందికి తినేందుకు తిండి గింజలు కూడా లేవని... ఇప్పుడు చంద్రుడిపైకి స్వయంగా కాలుమోపే స్థాయికి ఎదిగామని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను బాలయ్య ఎగురవేశారు. పేషెంట్లకు, చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బసవతారకం ఆసుపత్రి గత 23 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నిరంతరాయంగా సేవలు అందిస్తోందని బాలకృష్ణ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. దేశానికి ఎందరో మహనీయులు సేవలు అందించారని... వారిలో తన తండ్రి ఎన్టీఆర్ ఒకరని చెప్పారు. ఆయన స్థాపించిన బసవతారకం ఆసుపత్రి ఎంతో మంది క్యాన్సర్ రోగులకు నిరంతరాయంగా సేవలందిస్తోందని అన్నారు.

More Telugu News