Karthikeya: చరణ్ చేతుల మీదుగా జరగనున్న 'బెదురులంక 2012' ట్రైలర్ లాంచ్!

Bedurulanka 2012 movie trailer release date confirmed
  • కార్తికేయ హీరోగా 'బెదురులంక 2012'
  • కథానాయికగా అలరించనున్న నేహా శెట్టి 
  • ప్రత్యేక ఆకర్షణగా మణిశర్మ సంగీతం 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల

కార్తికేయ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బెదురులంక 2012' సినిమా రెడీ అవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. లౌక్య బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించగా, క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. 

ఈ సినిమా నుంచి రేపు చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఎల్బీ శ్రీరామ్ .. శ్రీకాంత్ అయ్యంగార్ .. సత్య ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

కార్తికేయ కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే  నమ్మకంతో ఉన్నాడు. 'డీజే టిల్లు'తో యూత్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన నేహా శెట్టి, ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News