Narendra Modi: మధ్యతరగతి సొంతింటి కల తీరేలా త్వరలో కొత్త పథకం.. ఎర్రకోట వేదికగా మోదీ ప్రకటన

PM Modi talks about new scheme for middle class for own house during redfort address
  • ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగం
  • మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేందుకు ఓ కొత్త పథకం తీసుకొస్తామని వెల్లడి
  • లక్షల రూపాయల మేర లాభం చేకూరుతుందని ప్రకటన
  • పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్న మోదీ
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశరాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మధ్యతరగతి ప్రజల సొంతింటి కల తీరే ఓ కొత్త పథకం గురించి ప్రస్తావించారు. ‘‘కొత్త ప్రపంచంలో భారత్‌ను విస్మరించడం ఎవ్వరి తరమూ కాదు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి కొత్త పథకం ప్రవేశపెట్టబోతున్నాం. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడతాం. పట్టణ ప్రాంతాల దిగువ, మధ్యతరగతి సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకాన్ని రూపొందిస్తున్నాం. లక్షల్లో ప్రయోజనం కల్పించే ఈ పథకం పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అని ప్రధాని పేర్కొన్నారు, దీంతో, ఈ కొత్త పథకం ఏమై ఉంటుందా? అని దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Narendra Modi
Independence Day Address
BJP
India

More Telugu News