earthquake: అసోంలో భూకంపం, ఈశాన్య రాష్ట్రాల్లో కంపించిన భూమి

  • 5.4 తీవ్రతతో భూకంపం
  • ఈ రాత్రి గం.8.23 కు పలుచోట్ల కంపించిన భూమి
  • నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలలో ప్రకంపనలు
Massive earthquake strikes Assam rest of NE

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ భూకంపం సంభవించింది. అసోంలోని పలు ప్రాంతాల్లో సోమవారం 5.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారిక సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలియరాలేదు. 

ప్రాథమిక నివేదిక ప్రకారం, సోమవారం రాత్రి గం.8:23 సమయానికి బంగ్లాదేశ్, మయన్మార్, భారత్ తదితర చోట్ల భూకంపం సంభవించింది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రలైన నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలలోను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

సోమవారం రాత్రి గం.20.19 నిమిషాలకు మొదటి భూకంపం 25.02 అక్షాంశం, 92.13 రేఖాంశం వద్ద సంభవించగా, మేఘాలయలోని చిరపుంజికి ఆగ్నేయంగా 49 కిలో మీటర్ల దూరంలో 16 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

More Telugu News