Droupadi Murmu: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి: రాష్ట్రపతి ముర్ము

  • రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం
  • తన సందేశాన్ని వెలువరించిన భారత రాష్ట్రపతి 
  • దేశ జీడీపీ ఏటా పెరుగుతోందని వెల్లడి
  • మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని స్పష్టీకరణ
President of India Droupadi Murmu messages ahead of Independence day

రేపు (ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు. భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుందని తెలిపారు. త్రివర్ణ పతాకాన్ని చూస్తే మన హృదయం ఉప్పొంగుతుందని వివరించారు. 

"భారతదేశ జీడీపీ ఏటా పెరుగుతోంది. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఆదివాసీల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మన మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధపడుతున్నారు. 

ఈ ఏడాది చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టాం. చంద్రయాన్-3 జాబిల్లిపై కాలు మోపే ఘడియ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. సౌర, పవన విద్యుదుత్పత్తి పెంచే కార్యక్రమాలు చేపట్టాం. 2047 లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి" అని ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు.

More Telugu News