ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక
- ఓఆర్ఆర్ అమ్ముకోవడానికి.. దళితుల భూములు లాక్కోవడానికి తెలంగాణ ఇవ్వలేదన్న పీసీసీ చీఫ్
- వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25 సీట్లు కూడా రావని జోస్యం
- దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారని వ్యాఖ్య
- తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ వైన్స్ టెండర్లు వేస్తామని స్పష్టీకరణ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని పలు సర్వేలు చెబుతున్నాయని, ఆ పార్టీకి కనీసం 25 సీట్లు కూడా రావని, ఈ కారణంగానే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశ్యంతో భూములను అమ్మి వాటి ద్వారా వచ్చే సొమ్మును మూటగట్టి విదేశాలకు పారిపోవాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. సొంత మనుషులకు ఇచ్చుకోవడానికే ముందుగా వైన్స్ టెండర్లు వేస్తున్నారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు వేస్తామని స్పష్టం చేశారు.