Asaduddin Owaisi: ఢిల్లీలోని నా ఇంటిపై రాళ్ల దాడి జరిగింది: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

  • ఢిల్లీలోని అసద్ ఇంటిపై నిన్న రాళ్లదాడి    
  • ఒక ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేమిటని ప్రశ్న
  • బీజేపీ నేత ఇంటిపై జరిగితే ఇలాగే ఉండేవారా? అన్న అసద్
Stone pelting on MP Asaduddins house in delhi

ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరిగిందని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఈ దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తన ఇంటిపై గతంలోను రాళ్ల దాడి జరిగిందని, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. ఓ వైపు ముస్లింల ఇళ్ళపైకి బుల్డోజర్లు పంపుతూ, మరోవైపు ఎంపీల ఇళ్ళపై రాళ్ల దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇదే దాడి ఓ బీజేపీ నేత ఇంటిపై జరిగితే మౌనంగా ఉండేవారా? అని ప్రశ్నించారు. 

అగస్ట్ 13న సాయంత్రం అసద్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి తలుపుల అద్దాలను ధ్వంసం చేశారు. కాగా, దాడికి సంబంధించి అసద్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ పగిలిన అద్దాల చుట్టూ ఎలాంటి రాయి లేదా ఇతర వస్తువులు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇదే ఇంటిపై దాడి జరిగింది.

More Telugu News