Perni Nani: సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నారు: పవన్ పై పేర్ని నాని ఫైర్

Perni Nani fires on Pawan Kalyan
  • నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటమే పవన్ కు అలవాటన్న పేర్ని నాని
  • టీడీపీ, జనసేన రెండూ కలిసే పని చేస్తాయని చెప్పాలని డిమాండ్
  • పవన్ వి నిలకడలేని రాజకీయాలని విమర్శ

ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని మండిపడ్డారు. నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడటమే పవన్ కు అలవాటని... జనం నవ్వుకుంటారని కూడా ఆయనకు లేదని అన్నారు. చంద్రబాబు కోసం పని చేస్తున్నాననే విషయాన్ని పవన్ ధైర్యంగా చెప్పాలని డిమాండ్ చేశారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన రెండూ కలిసే పని చేస్తాయని... టీడీపీ ఇన్ఛార్జీని పెట్టిన చోట జనసేన ఇన్ఛార్జీలను పెట్టబోమని చెప్పాలని అన్నారు. సినిమా గ్లామర్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను అమ్మేస్తున్నావని దుయ్యబట్టారు. వైసీపీ నుంచి ఎవరినీ పార్టీలోకి రానివ్వనని చెప్పిన పవన్.. ఇప్పుడు ఎవరెవరు వస్తారా అని ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు. పవన్ వి నిలకడలేని రాజకీయాలని ఎద్దేవా చేశారు. కేంద్రం సహకారంతో జగన్ ను ఆటాడించే శక్తి కనుక ఉంటే... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News