శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్గా రష్మిక
- ధనుష్ హీరోగా రాబోతున్న చిత్రం
- తమిళ స్టార్ కెరీర్లో ఇది 51వ సినిమా
- ప్రస్తుతం రష్మిక చేతిలో ‘పుష్ప2’, ‘యానిమల్’ చిత్రాలు
ఈ సినిమాలో ధనుష్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్న ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. రష్మికకు స్వాగతం చెబుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ క్రేజీ ఆఫర్ తో రష్మిక చాలా సంతోషంగా ఉంది. సదరు పోస్టర్ ను ఫ్రేమ్ చేయించి ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకుంది.