స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా 1800 మంది సామాన్యులు
- వివిధ వృత్తులకు చెందిన వారిని ఆహ్వానించిన ప్రభుత్వం
- ఆహ్వానితుల జాబితాలో 400 మంది సర్పంచులు
- కొత్త పార్లమెంట్ నిర్మాణ కూలీలకూ ఆహ్వానం
కొత్త పార్లమెంట్ భవనం సహా సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగమైన 50 మంది నిర్మాణ కార్మికులు, ఖాదీ కార్మికులు, సరిహద్దు రోడ్ల నిర్మాణం, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన తయారీలో భాగమైన 50 మంది చొప్పున వేడుకలకు హాజరు కానున్నారు. అలాగే 50 మంది చొప్పున ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులకు కూడా ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొనే అవకాశం లభించింది. కాగా, ప్రభుత్వ జన్ భగీదరి దార్శనికతకు అనుగుణంగా ఇలాంటి సామాన్య ప్రజలను స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు ఆహ్వానించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి 75 మంది దంపతులను తమ సంప్రదాయ దుస్తులలో ఎర్రకోటలో జరిగే వేడుకను చూసేందుకు ఆహ్వానించారు.