Chiranjeevi: 'భోళాశంకర్'కి అదే మైనస్ అంటున్న ఆడియన్స్!

  • ఈ నెల 11న విడుదలైన 'భోళాశంకర్'
  • మెగా ఫైట్లు .. డాన్సుల వరకూ ఓకే 
  • ఆడియన్స్ ను నవ్వించడంలో విఫలమైన కామెడీ ట్రాక్ 
  • చిన్న చిన్న పాత్రలు చేసే అనవసరమైన హడావిడి 
  • కథను మరింత పలచన చేసిన సెకండాఫ్
Bhola Shankar movie update

చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'భోళా శంకర్' ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి, మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. గతంలో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకి ఇది రీమేక్. అక్కడ ఆ సినిమా బ్లాక్ బస్టర్ కనుక .. ఇక్కడ కూడా అదే రిజల్టును రాబట్టే అవకాశాలు ఉన్నాయని ఆశించారు .. కానీ అలా జరగలేదు. 

మెగాస్టార్ నుంచి ఆడియన్స్ ఆశించే డాన్సులు .. ఫైట్లు .. ఎనర్జీ లెవెల్స్ కి ఆయన న్యాయం చేశారు. కానీ మెహర్ రమేశ్ చేసిన కొన్ని పొరపాట్ల వలన ఆడియన్స్ కి ఈ సినిమా సంతృప్తిని కలిగించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం మొదటి నుంచి చివరివరకూ వేసుకున్న కామెడీ ట్రాక్ దెబ్బకొట్టేసింది. సెకండాఫ్ లో మురళీశర్మ ఇంటిచుట్టూ కథను తిప్పుతూ, సిల్లీ సీన్స్ తో చాలా సమయాన్ని వృథా చేశారని అంటున్నారు. 

చిరంజీవి తనని తాను ప్రూవ్ చేసుకుని ఏళ్లు గడిచిపోయాయి. ఆయన తరువాత ఆ స్థాయిలో దూసుకొచ్చిన హీరో ఇంతవరకూ లేడు. అలాంటి మెగాస్టార్ ను చాలా చిన్న చిన్న పాత్రలతో పదే పదే పొగిడించడం అనవసరం. 'యాక్టింగ్ వైపు వెళ్లకూడదూ .. దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలేస్తావ్' అని చిరంజీవితో అనే డైలాగ్ ఓ మచ్చుతునక. 

ఇక 'వేదాళం' సినిమా సక్సెస్ కి గల కారణాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటి. కానీ ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లెవెల్స్ ఇబ్బంది పెట్టేశాయని అంటున్నారు. మెహర్ కి మెగాస్టార్ చాలా సమయాన్ని ఇచ్చారు .. కానీ ఆ సమయాన్ని ఆయన సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News