Botsa: హైకోర్టులో లాయర్ గా బొత్స సత్యనారాయణ భార్య

Botsa Jhansi Lakshmi Starts law practice in AP High Court

  • బార్ అసోసియేషన్ మెంబర్ గా రిజిస్టర్ చేసుకున్న బొత్స ఝాన్సీ  
  • రెండుసార్లు ఎంపీగా సేవలందించిన మాజీ ఎంపీ
  • ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు

లోక్ సభ మాజీ సభ్యురాలు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ లక్ష్మి హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ, ఎల్ఎల్ బీ, ఎల్ఎల్ఎం పూర్తిచేసిన ఝాన్సీ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆమెకు అభినందనలు తెలిపారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూనే ఝాన్సీ ఉన్నత చదువులు పూర్తిచేశారు. రెండుమార్లు లోక్ సభకు ఎంపికైన ఝాన్సీ.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు.

విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా రెండుమార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగానూ ఝాన్సీ ప్రజాసేవ చేశారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించారు. చదువుకు వయస్సు అడ్డు కాదని ముందుకుసాగారు. రాజకీయాల్లో మహిళా సాధికారిత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యలో కూడా అటు వైపే సాగారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఫిలాసఫీలో మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్ డీ పూర్తిచేశారు.

Botsa
Botsa Satyanarayana
Botsa Jhansi Lakshmi
Ex MP
bobbili Ex MP
Vijayanagaram District
  • Loading...

More Telugu News