Chiranjeevi: మోకాలి సర్జరీ చేయించుకోబోతున్న చిరంజీవి?

Chiranjeevi to undergo knee operation
  • గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి
  • సర్జరీ చేయించుకోవాలని మెగాస్టార్ కు సూచించిన వైద్యులు
  • హైదరాబాద్ లో కానీ, విదేశాల్లో కానీ సర్జరీ చేయించుకోనున్నట్టు సమాచారం

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళాశంకర్' ఈ నెల 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే, ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. మెగా అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు చిరంజీవికి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న చిరంజీవి శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారట. సర్జరీ చేయుంచుకోవాలని చిరంజీవికి డాక్టర్లు సూచించారని... దీంతో ఆయన ఆపరేషన్ చేయించుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్. హైదరాబాద్ లో కానీ, విదేశాల్లో కానీ ఆయనకు సర్జరీ జరగనుందని చెపుతున్నారు. 

సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఏడాది కాలంలో ఆయన నాలుగు చిత్రాలు చేయడాన్ని విశేషంగా చెప్పుకోవచ్చు. సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నారు. దర్శకుడు కల్యాణ్ కృష్ణతో సినిమా ఇప్పటికే ఫైనలైజ్ అయిందట. మలయాళ హిట్ చిత్రం 'బ్రో డాడీ' రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించనున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News