Leopard: తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 38వ మలుపు వద్ద కనిపించిన చిరుత

  • లక్షిత అనే బాలిక తిరుమల అలిపిరి నడకదారిలో చిరుతకు బలి
  • హడలిపోతున్న భక్తులు
  • తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
  • భయాందోళనలకు గురైన వాహనదారులు
Leopard spotted at 38th turn in Tirumala first ghat road

ఇటీవల తిరుమల అలిపిరి నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి బలిగొనడం తీవ్ర కలకలం రేపింది.  కాగా, ఇవాళ తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత హడలెత్తించింది. ఘాట్ రోడ్డులో 38వ మలుపు వద్ద చిరుత భక్తులకు కనిపించింది. చిరుతను చూడగానే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చిరుతను అడవిలోకి తరిమారు. 

లక్షిత మృతి నేపథ్యంలో, నడక మార్గంలో భద్రత నడుమ భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. చిరుతను బంధించేందుకు అటవీశాఖ రెండు బోన్లు ఏర్పాటు చేసింది. అధికారులు ట్రాప్ కెమెరాలతో చిరుత కదలికలను గమనిస్తున్నారు.

ఇటీవల ఓ చిరుత కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసినప్పటికీ, ఆ బాలుడికి ప్రాణాపాయం కలగలేదు. కానీ ఈసారి ఆరేళ్ల బాలిక చిరుత దాడి నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ ఘటన అనంతరం, తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు నడక దారిలో వస్తున్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

More Telugu News