Swami Nithyananda: డ్రమ్స్ వాయిస్తూ ఖుషీ ఖుషీగా స్వామి నిత్యానంద... వీడియో ఇదిగో!

  • స్వామి నిత్యానందపై అత్యాచార ఆరోపణలు
  • దేశం విడిచి పారిపోయిన వైనం
  • కైలాస పేరుతో దేశం ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు
  • తాజాగా యువత సాధికారత కార్యక్రమంలో స్టేజిపై నిత్యానంద సంగీత ప్రదర్శన
Swami Nithyananda was seen playing drums in a video

అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద కైలాస పేరుతో ఓ దేశం ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసిందే. కైలాస దేశం ప్రతినిధులమంటూ కొన్నాళ్ల కిందట కొందరు అతివలు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ కార్యక్రమంలోనూ దర్శనమిచ్చారు. 

తాజాగా, స్వామి నిత్యానంద ఓ కార్యక్రమంలో డ్రమ్స్ వాయిస్తూ సందడి చేశారు. యువత సాధికారత కార్యక్రమంలో భాగంగా స్టేజి ఎక్కిన స్వామి నిత్యానంద కొన్ని పాటలకు డ్రమ్స్ వాయించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఎంతో ఆస్వాదించరనడానికి నిదర్శనంగా స్టేజిపై ఉల్లాసంగా దర్శనమిచ్చారు.

More Telugu News