Prabhas: సలార్ నుంచి పంద్రాగస్టు కానుక.. సర్‌‌ప్రైజ్‌పై సస్పెన్స్‌!

  • ఈ నెల 15న చిత్రం నుంచి కొత్త అప్‌డేట్
  • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న ప్రభాస్
  • సెప్టెంబర్ 28న విడుదల కానున్న చిత్రం
Salaar update on Aug 15

రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సెప్టెంబర్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానుంది. పోస్టర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై హైప్‌ ను మరింత పెంచాయి. 

తాజాగా పంద్రాగస్టు కానుకగా ఈ చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్ రానుంది. ఈ ఆప్‌ డేట్ టీజరా? పాటనా? మరో పోస్టరా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌ గా నటించింది.

More Telugu News