rain: ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ హెచ్చరిక

Intense Rainfall Ahead For These States Warns Weather Agency

  • ఇప్పటికే హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
  • బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
  • రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లోను రానున్న రెండు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.

ఈమేరకు ఐఎండీ ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేసింది. బెంగాల్, సిక్కింలలో భారీ వర్షాలకు అవకాశముందని, అగస్ట్ 12, 13 తేదీల్లో 115.6 మిల్లీ మీటర్ల నుండి 204.4 మిల్లీ మీటర్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురవవచ్చునని తెలిపింది. ఉత్తరాఖండ్‌లో అగస్ట్ 12, 15, 16 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ కూడా 115 నుండి 204 మిల్లీ మీటర్ల భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండి జిల్లాలో బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మరోవైపు, రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తిరుపతి, కడప, అన్నమయ్య నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.

rain
Uttarakhand
West Bengal
Andhra Pradesh
  • Loading...

More Telugu News