KTR: పోచంపల్లిలో హ్యాండ్లూమ్ పార్క్ కు శంకుస్థాపన చేసిన కేటీఆర్

KTR inaugurates handloom park in Pochampalli
  • భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన కేటీఆర్
  • నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
  • చేనేతలను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని వ్యాఖ్య
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. టౌన్ లోని మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. హ్యాండ్లూమ్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. సైనీ భారత్ ఇంటెగ్రేటెడ్ హ్యాండ్లూమ్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేనేత యూనిట్ ను ఏర్పాటు చేసిన సైనీ భారత్ యూనిట్ ను కేటీఆర్ అభినందించారు. నేతన్నలకు భారీగా ఉపాధి కల్పించే ఉద్దేశంతో యూనిట్ ను ఏర్పాటు చేశారని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నింటిని అమ్ముతూ చేనేతలను ఇబ్బంది పెడుతోందని... తెలంగాణ ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్క్ ను కొనుగోలు చేసిందని చెప్పారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్ టైల్ క్లస్టర్ మాదిరి... పోచంపల్లి నేతన్నలు సమష్టిగా పని చేయాలని సూచించారు.
KTR
BRS
Pochampalli
Handloom Park

More Telugu News