MIG 29: ఆధునికీకరించిన మిగ్-29 ఫైటర్ జెట్లను శ్రీనగర్ లో మోహరించిన ఎయిర్ ఫోర్స్.. కారణం ఇదే!

  • మిగ్-21ల స్థానంలో మిగ్-29ల మోహరింపు
  • మిగ్-21లతో పోలిస్తే మిగ్-29లు మరెంతో శక్తిమంతం  
  • మిగ్-29లో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్ సిస్టమ్
MIG 29 squadron deployed in Srinagar

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఆధునికీకరించిన మిగ్-29 ఫైటర్ జెట్ యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోహరించింది. మిగ్-21 విమానాల స్థానంలో మిగ్-29 స్క్వాడ్రన్ ను మోహరింపజేసింది. పాకిస్థాన్, చైనాల నుంచి ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు వీలుగా వీటిని మోహరించారు. ఈ ఫైటర్ జెట్స్ నుంచి లాంజ్ రేంజ్ క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. 

మిగ్-21ల కంటే మిగ్-29లలో ఎన్నో అడ్వాంటేజ్ లు ఉన్నాయి. పాకిస్థాన్ భూభాగంలోని బాలాకోట్ లో ఈ విమానాలు ఎయిర్ స్ట్రైక్స్ జరిపాయి. వీటిలో ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైల్స్ సిస్టమ్ ఉంది. మిగ్-21లో లేని ఎయిర్ టు గ్రౌండ్ వెపనరీ సిస్టమ్. యుద్ధ సమయంలో శత్రు విమానాల సామర్థ్యాలను జామ్ చేసే వ్యవస్థ కూడా మిగ్-29లో ఉంది. ఇప్పటికే ఈ యుద్ధ విమానాలు కశ్మీర్ లోయ మొత్తం చక్కర్లు కొట్టాయి. చైనా వైపు నుంచి గగనతల ఉల్లంఘనలు ఏమైనా చోటుచేసుకుంటే వారి యుద్ధ విమానాలను మిగ్-29లు దీటుగా ఎదుర్కోగలవు.

More Telugu News