Priyanka Gandhi: తెలంగాణలో ప్రియాంకా గాంధీ, డీకే శివకుమార్ లకు కీలక బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్

Key responsibilities given to Priyanka Gandhi and DK Shivakumar in Telangana Congress
  • తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు
  • రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్న ప్రియాంక, డీకే
  • ఎన్నికల వ్యూహాలు, ప్రచారం తదితర బాధ్యతల అప్పగింత
ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మరో ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు బాధ్యతలను అప్పజెప్పింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడం, ప్రచారం, ఇతర ప్రధాన బాధ్యతలను వీరికి అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నిర్ణయాలను వీరు తీసుకోనున్నట్టు సమాచారం.
Priyanka Gandhi
DK Shivakumar
Telangana
Congress

More Telugu News