MS Dhoni: దారి తెలీక ఇబ్బంది పడుతున్న ధోనీకి అభిమాని సాయం.. వైరల్ వీడియో ఇదిగో..!

MS Dhoni Seeks Navigation Help From Enthusiastic Fan To Reach Ranchi Video Viral
  • రాంచీకి దారెటని అభిమానిని అడిగిన ధోనీ
  • విగ్రహం ఉన్న సర్కిల్ దాటి ముందుకెళ్లాలని సూచించిన అభిమాని
  • అనంతరం అభిమానితో సెల్ఫీ దిగి తన దారిన వెళ్లిపోయిన మిస్టర్ కూల్ 
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరుకే కాకుండా ఆయన సింప్లిసిటీకి కూడా అభిమానులు ఎప్పుడో ఫిదా అయిపోయారు. అంతటి స్టార్ అయ్యుండి కూడా ఆయన అభిమానులతో సులువుగా కలిసిపోతుంటారు. గర్వం అన్నది మచ్చుకైనా కనిపించదు. అయితే, ధోనీ సింప్లిసిటీని తెలిపే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారి అభిమానులను అలరిస్తోంది. 

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ధోని తన స్నేహితుడితో కలిసి కారులో బయలుదేరాడు. స్నేహితుడే కారు నడిపాడు. అయితే, మార్గమధ్యంలో వారికి దారి తెలీకపోవడంతో అదేదారిలో వెళుతున్న ఓ బైకర్‌ను ధోని దారి ఎటని అడిగాడు. ‘‘అలా ముందుకు వెళితే నాలుగు రోడ్ల సర్కిల్ ఒకటి వస్తుంది. దాన్ని దాటి ముందుకెళితే రాంచీ వస్తుంది’’ అని అభిమాని చెప్పాడు. ‘‘అది విగ్రహం ఉన్న సర్కిలేనా?’’ అని ధోనీ మళ్లీ అడగ్గా అతడు అవునని చెప్పాడు. ఆ తరువాత తన ఫ్యాన్‌తో ధోనీ సెల్ఫీ దిగి ముందుకెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

MS Dhoni
Viral Videos
Ranchi

More Telugu News