JP Cinemas: చందానగర్‌ జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన స్క్రీన్లు

Major fire at JP Cinemas in Chandanagar
  • కపాడియా షాపింగ్‌మాల్ ఐదో అంతస్తులో థియేటర్
  • ఉదయం ఆరు గంటల సమయంలో ఎగసిపడిన మంటలు
  • స్కై లిఫ్టర్, నాలుగు ఫైరింజన్లతో మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
  • షాపింగ్‌మాల్‌కు ఫైర్ ఎన్‌వోసీ లేదంటున్న జీహెచ్ఎంసీ
హైదరాబాద్ చందానగర్‌‌లోని జేపీ సినిమాస్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా థియేటర్‌లో మంటలు చెలరేగాయి. థియేటర్‌లోని ఐదు స్క్రీన్లు, ఫర్నిచర్ దగ్ధమైంది. కపాడియా షాపింగ్‌మాల్‌లోని ఐదో అంతస్తులో ఉన్న జేపీ సినిమాస్‌లో అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్కై లిఫ్టర్, నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. షాపింగ్‌మాల్‌కు ఫైర్ ఎన్‌వోసీ లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు.
JP Cinemas
Chandanagar
Hyderabad

More Telugu News