YS Sharmila: ముగిసిన ఢిల్లీ పర్యటన, కాంగ్రెస్‌లో విలీనంపై షర్మిల ఏం చెప్పారంటే..!

YS Sharmila on party merger with Congress
  • శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు
  • కోమటిరెడ్డి ఆహ్వానంపై చూద్దామంటూ కామెంట్ 
  • అంతకుముందే పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ కోమటిరెడ్డి
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరికపై మీడియా ప్రశ్నించగా స్పందించలేదు. మరోపక్క, ఆమెను భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి విదితమే. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన షర్మిలను కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనికి ఆమె 'చూద్దాం..' అంటూ ముందుకు కదిలారు. పార్టీ విలీనం గురించి మీడియా ప్రతినిధులు పలుమార్లు ప్రశ్నించినా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. నవ్వుతూ వెళ్లిపోయారు.
YS Sharmila
Komatireddy Venkat Reddy
Congress
YSRTP

More Telugu News