రుణాలు భవిష్యత్తుకు పెట్టుబడి: మొహాలీ ఐఎస్బీ సమావేశంలో మంత్రి కేటీఆర్
- ప్రజాక్షేత్రంలో గెలవడం యూపీఎస్సీ పరీక్ష కంటే కఠినమని వ్యాఖ్య
- శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తు ప్రభుత్వాలకు మరింత సవాల్ అన్న కేటీఆర్
- తెలంగాణ ఉద్యమం వల్ల క్షేత్రస్థాయిలో పని చేసే అవకాశం తనకు లభించిందన్న మంత్రి
దేశంలోనే తెలంగాణ విజయవంతమైన రాష్ట్రం అన్నారు. రాజకీయ నాయకత్వానికి చిత్తశుద్ధి, విజన్ ఉంటే ప్రగతి, పాలనలో విజయాలు సాధ్యమన్నారు. తెలంగాణ మోడల్ ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు సవాల్‌తో కూడుకున్నవే అన్నారు. మౌలిక వసతులపై పెట్టే ప్రతి పైసా పెట్టుబడి భవిష్యత్తుకు భరోసా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో యాభై శాతం త్వరలో తెలంగాణ ఉత్పత్తి చేయనుందన్నారు. అభివృద్ధి కోసం రుణాలు తీసుకోకూడదనే పాత ధోరణి వల్ల భారత్ ప్రగతి పథంలో ముందుకు సాగడం లేదన్నారు. అన్ని దేశాలు రుణాలను పెట్టుబడిగా చూస్తుంటే, భారత్‌లో అలాంటి ఆలోచన లేదన్నారు.