Samantha: వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ కు సమంతకు ఆహ్వానం

Invitation to Samantha for World Largest India Day parade
  • సినిమాలకు  ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత
  • న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం
  • గతంలో ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్, రానా
సినిమాలకు ఏడాది పాటు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. బాలి ట్రిప్ ను ముగించుకుని ఇటీవలే ఆమె ఇండియాకు వచ్చింది. మరోవైపు, సామ్ కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలంటూ ఆమెకు ఆహ్వానం అందించి. వరల్డ్ లార్జెస్ట్ డే పరేడ్ లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు. ఈ ఏడాది సమంతతో పాటు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నటుడు రవికిషన్ లకు కు ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్, రానా, అభిషేక్ బచ్చన్, అర్జున్ రాంపాల్, రవీనా టాండన్, తమన్నా, సన్నీడియోల్ తదితరులు హాజరయ్యారు. 

ఇక సినిమాల విషయానికి వస్తే... సామ్ నటించిన 'ఖుషీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
Samantha
Tollywood

More Telugu News