Rahul Gandhi: రాహుల్ గాంధీ శిక్షను సమర్థించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ

  • వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది జడ్జిలను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
  • రాహుల్ కేసును విచారించిన జస్టిస్ హేమంత్ బదిలీ
  • రాహుల్ కు కింది కోర్టు విధించిన శిక్షపై స్టే విధించిన సుప్రీంకోర్టు
Gujatat high court judge who supportedRahul Gandhi conviction is trasferred

మోదీ ఇంటి పేరుపై పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన గుజరాత్ హైకోర్టు జడ్జి బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 9 మంది న్యాయమూర్తులను బదిలీ చేయాయని కొలీజియం సిఫార్సు చేసింది. 

ఆమధ్య సూరత్ కోర్టు విధించిన శిక్షపై రాహుల్ గుజారాత్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ హేమంత్ రాహుల్ పిటిషన్ ను తిరస్కరించారు. కింది కోర్టు తీర్పును సమర్థించారు. అయితే, రాహుల్ ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రాహుల్ కు ఊరట లభించింది. ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మళ్లీ పార్లమెంటులో అడుగు పెట్టారు. ఎంపీగా ఆయనకిచ్చిన అధికారిక బంగ్లాను కూడా మళ్లీ ఆయనకు కేటాయించారు.

More Telugu News