Telangana: 3 రోజుల్లో 2 వేల దరఖాస్తులు.. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు భారీ స్పందన

  • ఎన్నికల సమయం కావడంతో విపరీతమైన పోటీ
  • రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో టెండర్లకు భారీ స్పందన
  • నాన్ రిఫండబుల్ ఫీజు కింద ప్రభుత్వ ఖజానాకు భారీగా సమకూరనున్న ఆదాయం
Huge Response to Telangana wine shop tenders

తెలంగాణాలో రాబోయే ఎన్నికల సీజన్ నేపథ్యంలో మద్యం షాపుల టెండర్లకు రెస్పాన్స్ భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు. షాపులను దక్కించుకుంటే కాసుల వర్షం కురుస్తుందనే ఉద్దేశంతో చాలామంది దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వివరించారు. దీంతో ఈసారి మద్యం టెండర్లకు భారీ పోటీ నెలకొందని చెబుతున్నారు. దరఖాస్తు ఫీజు కింద (నాన్ రిఫండబుల్) రూ.2 లక్షలు వసూలు చేస్తున్నా వ్యాపారులు వెనక్కి తగ్గడంలేదన్నారు. గత నోటిఫికేషన్ లో దరఖాస్తు ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1,350 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈసారి ఇంకా పెద్ద మొత్తమే ప్రభుత్వ ఖజానాకు చేరనుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని అధికారులు చెప్పారు. ముఖ్యంగా కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో మద్యం షాపుల టెండర్లకు చాలామంది పోటీపడుతున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం షాపులు ఉండగా.. ఇప్పటికే 2 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 18 సాయంత్రం 6 గంటలకు టెండర్ దాఖలు గడువు ముగుస్తుందని, 21న లాటరీ విధానంలో మద్యం షాపులు కేటాయిస్తామని అధికారులు వివరించారు.

More Telugu News