Crime News: కూతుర్ని చంపి శవాన్ని బైక్‌కు కట్టి డంపింగ్ వరకు ఈడ్చుకెళ్లిన తండ్రి

Man Kills Her Daughter and ties body to bike
  • పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఘటన
  • కుమార్తె ప్రవర్తనపై అనుమానంతోనే దారుణం
  • అసలు విషయం తెలియాల్సి ఉందన్న పోలీసులు
కుమార్తెను దారుణంగా హత్య చేసిన తండ్రి ఆపై ఆమె శవాన్ని బైక్‌కు కట్టి డంపింగ్ యార్డ్ వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లాలో నిన్న జరిగిందీ ఘటన. కుమార్తె తీరుపై అనుమానంతో అతడీ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి వచ్చిన తర్వాత పదునైన ఆయుధంతో ఆమెను చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తాడుతో బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, హత్యకు గల కారణం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
Crime News
Punjab
Amritsar

More Telugu News