Adipurush: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

  • ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్
  • బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రం
  • అమెజాన్ ప్రైమ్ లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్
Adipurush Streaming On Amazon Prime In All South Indian Languages

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన చిత్ర 'ఆదిపురుష్'. రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య విడుదలైంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించగా జానకి పాత్రలో కృతీ సనన్ నటించింది. కానీ, కథలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయిన ఈ చిత్రం పలు వివాదాలకూ కేంద్ర బిందువుగా మారింది. బ్రేక్ ఈవెన్ కూడా సాధించకముందే థియేటర్ల నుంచి తెరమరుగైంది.

తాజాగా ఈ చిత్రం నిశ్శబ్దంగా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' లో నిన్న అర్ధరాత్రి నుంచి ‘ఆదిపురుష్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ఇది అందుబాటులో ఉంది. ప్రైమ్ ఖాతాదారులు అదనంగా రూ.279 కడితేనే ఈ సినిమాను చూడొచ్చు. దక్షిణాది భాషల్లో సినిమా అమెజాన్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆదిపురుష్ హిందీ ఓటీటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

More Telugu News