Chiranjeevi: చిరంజీవి భోళాశంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్

Line clear to Chiranjeevi Bhola Shankar movie
  • గాయత్రి ఫిలిమ్స్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సిటీ సివిల్ కోర్టు
  • కోర్టు నిర్ణయంతో భోళా శంకర్ విడుదలపై వీడిన సందిగ్ధత
  • అగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా
చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. గాయత్రి ఫిలిమ్స్ పిటిషన్‌ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు గురువారం డిస్మిస్ చేసింది. దీంతో శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఇప్పటి వరకు కోర్టులో పిటిషన్ ఉండటంతో సందిగ్ధత కనిపించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అగస్ట్ 11న భోళాశంకర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఏం జరిగింది?

భోళా శంకర్ సినిమాను నిలిపివేయాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టుకు వెళ్లారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర తనను రూ.30 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించారు. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అయిదేళ్లపాటు తన గాయత్రీ ఫిలిమ్స్‌కు ఇస్తానని గతంలో చెప్పారని, ఈ మేరకు అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని ఇందుకు గాను తన నుండి రూ.30 కోట్లు తీసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కానీ తనకు విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారని, తదనంతర పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందే తన డబ్బులు చెల్లిస్తానని చెప్పారన్నారు. దీంతో తాను న్యాయం కోసం కోర్టుకు వచ్చానని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేసింది. దీంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
Chiranjeevi
bhola shankar

More Telugu News