New Delhi: ఆఫీసుకు వెళ్లిరావడానికి చాలా టైమ్ పట్టిందట.. తొలి ఉద్యోగానికి తొలి రోజే రాజీనామా!

  • ఢిల్లీలోని ఓ కార్యాలయంలో జరిగిన ఘటన
  • తన అనుభవాన్ని రెడిట్ పోస్టులో రాసుకొచ్చిన సదరు వ్యక్తి
  • ప్రయాణం, ఆఫీసులో పని తర్వాత తనకు మూడు గంటలే మిగిలిందని ఆవేదన 
Delhi man quits job on day 1 due to long commute time

సాధారణంగా మొదటి ఉద్యోగం సాధించిన ఎవ్వరైనా తొలి రోజు ఎంతో ఉత్సాహంతో ఆఫీసుకు వెళ్తారు. మొదటి రోజే తమ పనితీరుతో బాస్‌ను, తోటి ఉద్యోగులను మెప్పించాలని అనుకుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి వెళ్లిన తొలి రోజే రాజీనామా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఇందుకు గల కారణం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ట్రాఫిక్ కూపంగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో ఆఫీస్‌కు వచ్చేందుకు చాలా సమయం పట్టడంతో ఆ వ్యక్తి మొదటి రోజే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు రెడిట్ పోస్ట్ లో పేర్కొనడం ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. 

ఢిల్లీలోని వాయవ్య ప్రాంతంలో నివసించే సదరు వ్యక్తి మంచి వేతనంతో ఓ కంపెనీలో ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించినట్టు తన పోస్టులో తెలిపాడు. అయితే గురుగ్రామ్‌లోని తన కార్యాలయానికి వెళ్లి రావడంతో ఒక రోజులో అతనికి మూడు గంటలు మాత్రమే ఖాళీ సమయం మిగిలిందని వాపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్ దగ్గరికి మకాం మార్చే ఉద్దేశం లేకపోవడంతో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ అనుభవాలను అతను రెడిట్ పోస్టులో పంచుకున్నాడు. ఈ పోస్టుకు ఒక్క రోజులోనే 400 అప్ ఓట్లు వచ్చాయి. కొందరు అతని నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా పేర్కొన్నారు. చాలా మంది సుదూరం ప్రయాణించి ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిసిందని, ఎవ్వరితో మాట్లాడకుండా తాను హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నానని అతను వెల్లడించడం కొసమెరుపు.

More Telugu News