Sohna Violence: నుహ్ ఘటన రోజే సోహ్నాలోనూ ఘర్షణలు.. కాల్పులు జరుపుతూ.. దాడులు చేస్తూ బీభత్సం

Mob opened fire and thrashed bike rider in Haryanas Sohna
  • జులై 31 సాయంత్రం 4 గంటల సమయంలో ఘటన
  • బైక్ రైడర్‌పై విచక్షణ రహితంగా దాడి
  • రాళ్లు రువ్వుతూ, దాడులు చేస్తూ రెచ్చిపోయిన మూక
హర్యానాలో సోహ్నా పట్టణంలో చెలరేగిన ఘర్షణలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కింది. నుహ్‌లో మత ఘర్షణలు జరిగిన జులై 31నే ఇక్కడ కూడా జరిగినట్టు తెలుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అల్లర్లు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు వ్యక్తులు రాళ్లు విసురుతూ, కాల్పులకు దిగి బీభత్సం సృష్టించారు. అదే సమయంలో అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి లాగిపడేసి కర్రలతో విచక్షణ రహితంగా చావగొట్టారు.

బ్రజ్ మండల్ యాత్ర సందర్భంగా నుహ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు గార్డులు,  ఓ మతబోధకుడు సహా ఆరుగురు మరణించారు. ఇలాంటి  ఘటనలే పొరుగునే ఉన్న గురుగ్రామ్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వెలుగుచూశాయి. నుహ్‌లో అల్లర్లకు కారణమైనట్టుగా భావిస్తున్న హోటల్ సహా అనేక నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది.
Sohna Violence
Haryana
Nuh Violence
Communal Clashes

More Telugu News