Pawan Kalyan: అందుకే పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేశారు: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopalakrishna suggestion to Pawan Kalyan
  • సమాజం మారాలని పవన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్న పరుచూరి
  • సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం మారుతుండాలని వ్యాఖ్య
  • పవన్ దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నారన్న రచయిత
సమాజం మారాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సమాజం మారాలంటే అప్పుడప్పుడు అధికారం చేతులు మారుతుండాలని, ఒకరి చేతుల్లోనే అధికారం ఉండకూడదన్నారు. ఆ కారణంగానే పవన్ గత ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. అప్పుడు ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, దెబ్బతిన్న పులిలా మళ్లీ వస్తున్నారన్నారు. రాజకీయాల్లో దెబ్బలు సహజమేనని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలన్నారు. సమాజం గురించి రాజకీయ నాయకులు చెబితే వినేవారి కంటే సినిమా నటులు చెబితే వినేవాళ్లే ఎక్కువగా ఉంటారన్నారు.

పవన్ కల్యాణ్ బాగుండాలని కోరుకునేవారిలో తానూ ఒకడినన్నారు. అయితే పవన్ సినిమాల్లో నటించడం ఆపేయవద్దని, అలాగే కొనసాగించాలన్నారు. సమయం లేకుంటే సీనియర్ ఎన్టీఆర్‌లా అప్పుడప్పుడైనా సినిమాల్లో కనిపించాలన్నారు. పవన్ కోరుకున్నది ఆయనకు దక్కాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. బ్రో సినిమా గురించి మాట్లాడుతూ... సాయిధరమ్ తేజ్ ప్రమోషన్ కోసమే ఈ సినిమా పవన్ చేసి ఉంటారన్నారు. పవన్ సినిమాల్లో అలాగే కొనసాగి ఉంటే మరో పదిపదిహేనేళ్లకు ఎన్టీఆర్, చిరంజీవిలా ఎదిగేవారన్నారు.
Pawan Kalyan
Janasena
paruchuri gopalakrishna
poltics

More Telugu News