Woman: పరస్పర అంగీకారంతో సహజీవనం చేసి, ‘రేప్’ అని ఆరోపిస్తే చెల్లదు: కర్ణాటక హైకోర్టు స్పష్టీకరణ

  • దీన్ని సెక్షన్ 376 కింద శిక్షించలేమన్న ధర్మాసనం
  • చట్టపరమైన ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టీకరణ
  • మహిళ దాఖలు చేసిన రెండు కేసులు కొట్టివేత
Woman canot allege rape after 6 years of consensual sex High Court

చట్టపరమైన ప్రక్రియ దుర్వినియోగానికి ఇదొక చక్కని ఉదాహరణగా పేర్కొంటూ, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి వ్యతిరేకంగా మహిళ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఆరేళ్ల పాటు తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకుంటాననే హామీని విస్మరించాడంటూ సదరు మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. 

‘‘ఏడాది కాదు, రెండు, మూడు, నాలుగు, ఐదేళ్లు కాదు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ఆరేళ్లపాటు అంగీకారంతో లైంగిక సంబంధం నిర్వహించారు. ఆరేళ్ల పాటు పరస్పర అంగీకారంతో లైంగిక కార్యం నిర్వహించడం అనేది అత్యాచారం కిందకు రాదు. సెక్షన్ 376 కింద శిక్షించలేం’’అని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. వీరు కలసిన మొదటి రోజు నుంచి 2019 డిసెంబర్ 27 వరకు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లు జస్టిస్ ఎం.నాగ ప్రసన్న పేర్కొన్నారు. మహిళ ఫిర్యాదు మేరకు ఇందిరానగర్ పోలీసులు దాఖలు చేసిన రెండు కేసులను కొట్టి వేశారు.

More Telugu News