Sim Cards: విజయవాడలో ఒకే వ్యక్తికి 658 సిమ్‌కార్డులు.. విచారణకు ఆదేశం

658 Sim Cards Issued To One Man In Vijayawada
  • ఏఐ టూల్‌కిట్‌తో గుర్తించిన టెలికమ్యూనికేషన్ శాఖ
  • సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు రిజిస్టర్ చేసినట్టు గుర్తింపు
  • అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ మరో 150 సిమ్‌ల జారీ

విజయవాడలోని గుణదలలో ఒకే వ్యక్తికి 658 సిమ్‌కార్డులు జారీ కావడంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకే ఫొటోతో, ఒకే నెట్‌వర్క్‌కు చెందిన ఈ సిమ్‌కార్డులను విక్రయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు వీటిని రిజిస్టర్ చేసినట్టు గుర్తించారు.

అలాగే, అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ మరో 150 వరకు సిమ్‌కార్డులు నకిలీ పత్రాలతో జారీ అయినట్టు గుర్తించారు. ఏఐ టూల్‌కిట్‌ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ల శాఖ ఈ మోసాన్ని గుర్తించింది. ఒకే ఫొటోతో జారీ అయిన ఈ సిమ్‌కార్డులు ఎక్కడికి వెళ్లాయి? వాటిని ఎవరు, ఎందుకోసం వినియోగిస్తున్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News