Prudhvi Raj: ‘బ్రో’ తరువాత నా కెరీర్‌‌ను మలుపు తిప్పే ఛాన్స్ వచ్చింది: నటుడు పృథ్వీ

Actor comediam prithvi talks about bumber offer he secured after bro movie
  • ‘బ్రో’ సినిమాలోని ‘శ్యాంబాబు’ పాత్రతో అభిమానులను అలరించిన పృథ్వీ
  • శ్యాంబాబు పేరుతోనే మరో సినిమాలో నటించబోతున్నానని వెల్లడి
  • తెరపై తన పాత్ర రెండు గంటలసేపు కనిపిస్తుందన్న నటుడు
  • మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తానంటూ వీడియో విడుదల
‘‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ..’’ అంటూ సినీ అభిమానుల్లో కమెడియన్‌గా తనదైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు పృథ్వీ. తాజాగా ‘బ్రో’ సినిమాలో ఆయన చేసిన ‘శ్యాంబాబు’ కారెక్టర్ రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది. ‘బ్రో’లో తెరపై ఆయన దాదాపు నిమిషం మాత్రమే కనిపించినా తనదైన కామెడీ పండించి అభిమానులను అలరించారు. అయితే, ఈ శ్యాంబాబు పాత్ర తనకు మరో అద్భుత అవకాశాన్ని తెచ్చిపెట్టిందని పృథ్వీ తాజాగా పేర్కొన్నారు. ‘శోభన్ బాబు’ అనే టైటిల్‌తో  నిర్మిస్తున్న ఓ చిత్రంలో మరో ‘శ్యాంబాబు’ పాత్ర తనకు దక్కిందని, స్క్రీన్‌పై ఏకంగా రెండు గంటల పాటు తన పాత్ర కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. 

‘‘ప్రముఖ రచయిత, దర్శకుడు నాకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్ర 1 నిమిషం 5 సెకన్లు ఉంటే, ఆయన చేయబోయే శోభన్‌బాబు సినిమాలో తెరపై రెండు గంటలు ఉంటాడు. నాకు ఇది అద్భుతమైన అవకాశం. ఆ రచయిత, దర్శకుడు ఎవరు? ఏ బ్యానర్‌లో సినిమా చేస్తున్నాను? తదితర విషయాలు త్వరలోనే తెలియజేస్తా. అది నా కెరీర్‌ను మలుపు తిప్పే చిత్రం అవుతుంది. ఈ శ్యాంబాబును అప్పుడు కూడా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పృథ్వీ’’ అని ఓ వీడియో విడుదల చేశారు.
Prudhvi Raj
Tollywood

More Telugu News