Youtube: యూట్యూబ్ లో 'టీ-సిరీస్' నెంబర్ వన్ స్థానానికి సవాల్ విసిరిన 'మిస్టర్ బీస్ట్'

  • టీ-సిరీస్ కు యూట్యూబ్ లో 247 మిలియన్ల సబ్ స్క్రైబర్లు
  • మిస్టర్ బీస్ట్ కు 174 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు
  • టీ-సిరీస్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్న మిస్టర్ బీస్ట్
Mr Beast challenges T Series in Youtube number one race

భారతీయ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ కు యూట్యూబ్ లో ఎంతమంది సబ్ స్క్రైబర్లు ఉన్నారో తెలిస్తే మతిపోతుంది. అక్షరాలా 247 మిలియన్ల మంది టీ-సిరీస్ ను సబ్ స్క్రైబ్ చేసుకున్నారు. సబ్ స్క్రైబర్ల పరంగా యూట్యూబ్ లో ఇదే రారాజు. 

అయితే, అమెరికా కంటెంట్ క్రియేటర్ మిస్టర్ బీస్ట్ ఇప్పుడు టీ-సిరీస్ నెంబర్ వన్ స్థానాన్ని తాను కైవసం చేసుకుంటానని సవాల్ విసురుతున్నాడు. మిస్టర్ బీస్ట్ కు యూట్యూబ్ లో 174 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వీడియో పబ్లిషింగ్ వేదిక యూట్యూబ్ లో టీ-సిరీస్ తర్వాత రెండో స్థానంలో ఉన్నది మిస్టర్ బీస్టే. 

గతంలో ప్యూడీపై అనే చానల్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, దాన్ని టీ-సిరీస్ అధిగమించి అగ్రస్థానం అధిష్ఠించింది. ఇప్పుడు, మిస్టర్ బీస్ట్ స్పందిస్తూ... ప్యూడీపై కోసం తాను టీ-సిరీస్ నెంబర్ వన్ స్థానాన్ని కూలదోస్తానని చెబుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇటీవలే ప్యూడీపైతో మిస్టర్ బీస్ట్ ఓ వీడియో కూడా చేశాడు. 

ఉత్తర భారతదేశంలో ఫోక్ సాంగ్స్ కు ఉన్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని టీ-సిరీస్ జానపద గాయకులను విశేషంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. టీ-సిరీస్ కు ఉన్న సబ్ స్క్రైబర్లలో అత్యధికులు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఫోక్ సాంగ్స్ అభిమానులే. యూట్యూబ్ లో టీ-సిరీస్ నెంబర్ వన్ స్థానాన్ని పడగొట్టడం అంత సులువు కాదని అభిమానులు అంటున్నారు.

More Telugu News