నేను చంద్రబాబు శిష్యుడిని కాదు: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- చంద్రబాబుకు సహచరుడిగా పని చేశానన్న రేవంత్
- డ్రగ్స్ కేసులో పిల్ వేసి కోర్టులో పోరాడామన్న టీపీసీసీ చీఫ్
- కేసీఆర్‌కు సంబంధం లేకుంటే కోర్టుకు వెళ్లి స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్న
తాను చంద్రబాబు నాయుడి శిష్యుడిని అని చెప్పడంపై కూడా రేవంత్ స్పందించారు. తాను శిష్యుడిని కాదని, టీడీపీ అధినేతకు సహచరుడిగా పని చేశానన్నారు. తాను ఎప్పుడూ తెలంగాణ పక్షానే నిలిచానని చెప్పారు. ఇప్పటి వరకు తాను పాలకులతో కలిసి ఏ ప్రభుత్వంలో లేనని చెప్పారు.